ఈ నీటిని జుట్టుకి రాయడం వల్ల మీ జుట్టు మృదువుగా మారుతుందట!

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 04:37 PM

ఈ నీటిని జుట్టుకి  రాయడం వల్ల మీ జుట్టు మృదువుగా మారుతుందట!

ఆడ పిల్లలు జుట్టును పెంచుకోవడానికి చాల రకాలైన ట్రీట్‌మెంట్లను చేయించుకుంటారు .అలా కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన ఇంట్లో లభించే వాటితో చేసుకోవచ్చును . వీటిలో గంజినీరు ఒకటి. చాలా రోజుల నుండి జుట్టుకోసం ఉపయోగించే సహజ నివారణలలో ఇది ఒకటి. దీని జుట్టుకి పట్టించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని గురించి తెలుసుకోండి.

మనము రైస్ వండుకునేటప్పుడు వచ్చే నీరును గంజి నీరు అంటారు . ఈ గంజినీటిలో ఇనోసిటాల్ ఉంటుంది. ఇది జుట్టుని బలంగా చేస్తుంది. అందుకోసం, బలమైన జుట్టుకి గంజినీరు మంచిది. ఇది జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్ళని బలంగా చేసి పెరిగేలా చేస్తుంది.ఈ గంజినీరు వాడితే చుండ్రు కూడా తగ్గుతుంది. ఇది వివిధ పదార్థాలతో కలపొచ్చు. వెంట్రుకలు నెరసిపోవడాన్ని తగ్గించేందుకు గంజినీరు కూడా మంచిది.అంతేకాకుండా ఇది జుట్టుని మెరిసేలా, మృదువుగా చేసేందుకు చాలా మంచిది. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలు కలిగి ఉంది. పొడి జుట్టు ఉన్నవారుగంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ అందుతాయి. జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మారుతుంది. పొడి జుట్టుకి సహజమైన షైన్, మృదుత్వాన్ని అందిస్తుంది. గంజినీటిని వాడడం మంచిది.
గంజినీరు జుట్టుకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీనికి మెంతికూర, అలవెరా కలపాలి. గంజినీరు పులిస్తే మరీ మంచిది. వీటన్నింటిని చక్కగా కలిపి జుట్టుకి అప్లై చేయండి. దీని వల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గించడానికి మంచిది.కావున మన కిచెన్ లోనే దొరికి వాటిని ఉపయోగించుకొని మన జట్టును కాపాడుకోవచ్చును . ఇలా చేయడం వలన డబ్బు కూడా ఆదా అవుతుంది . బ్యూటీ పార్లలో చేసే ట్రీట్ మెంట్ వలన కొన్ని సార్లు రాలిపోవడం లాంటిది కూడా జరుగుతుంది .





Untitled Document
Advertisements