సమ్మర్ వేడిని తట్టుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 10:56 AM

 సమ్మర్ వేడిని తట్టుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా , పెరుగుతున్న వేడి కారణంగా శారీరక సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం, గాలి వేగం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రోగులు వాంతులు విరేచనాల ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. మన ఆహారపు అలవాట్ల సరిగా లేకపోవడం వల్ల ఈ సీజన్‌లో అజీర్ణం ఏర్పడుతుందన్నారు. బలమైన వేడి గాలి కారణంగా, జలుబు, దగ్గు, అధిక జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మనమందరం జాగ్రత్తగా ఉండాలి.

ఈ వేసవిలో కొబ్బరి నీరు, ఇతర ద్రవాలు, ORS తో పాటు వేడిని తట్టుకోవడానికి మారుతున్న వాతావరణాన్ని నివారించడానికి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం తినాలి. అన్ని పోషకాలు శరీరానికి అందాలి. ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 లీటర్ల నీరు త్రాగాలి. చిన్నపిల్లలకు అవసరమైన విధంగా హెల్దీ డ్రింక్స్, మంచి నీటిని క్రమం తప్పకుండా అందించాలి. వీటితో పాటు వేసవిలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి . ఉదాహరణకు, బయటి ఆహారం తినకపోవడం మంచిది. జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం మానేయాలి. ముందు రోజు వండిన ఆహారం తీసుకోకూడదు. చిన్న పిల్లలను ఎండ నుండి రక్షించాలి. పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.

అంతేకాకుండా చాల మంది చేస్తున్న తప్పు ఏంటి అంటే ఎక్కువ నీరు తాగడం వల్ల ఎక్కువ మూత్రం వస్తుందనే ప్రశ్న చాలా మందికి ఉంది. అందుకే అలాంటి వారు తక్కువ నీరు తాగుతారని చెప్పారు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ ఇది కేవలం అపోహ మాత్రమే అన్నారు. నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు . అందువలన ఈ సమ్మర్ వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే
డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి . ఈ విధంగా ఉండడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును .





Untitled Document
Advertisements