ఒకేసారి 50 కోట్లుకు రెమ్యునరేషన్ పెంచిన నాని !

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 03:50 PM

ఒకేసారి 50 కోట్లుకు రెమ్యునరేషన్ పెంచిన నాని !

టాలీవుడ్ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నా నాని మొదటగా ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాని నటించిన ఈగ సినిమా బాగా హిట్ కావడం తో ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు . ఇప్పుడు నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న మూవీలతో వచ్చి రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంటే సుందరానికి మూవీని తెరకెక్కించిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నది . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది

మొత్తానికి ఈ సినిమాను ఆగస్టు 29వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెప్పుకోచ్చారు . నాని బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. దసరా మూవీ తర్వాత మరోసారి మాస్ ఎలివేషన్లలో కనిపించబోతున్నారు నాని. ఎస్‌ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అయితే డీవీవీ దానయ్య బ్యానర్ లో మరో సినిమాకు కూడా నాని సంతకం చేశారు. ఆ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. నాని బర్త్ డే రోజే ఈ మూవీ అనౌన్స్ చేసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. పూర్తిగా కార్టూన్స్ తో ఉన్న వీడియో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాదే ఈ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేస్తున్న రెండు చిత్రాలకు గాను నాని రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఒక్కో సినిమాకు నాని రూ.25 కోట్లు అడగ్గా దానయ్య ఓకే చెప్పేశారని సినీ వర్గాల్లో టాక్. దీంతో నేచురల్ స్టార్ కు దానయ్య సాలిడ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారన్నమాట. గత ఏడాది ముందు వరకు 20 కోట్ల వరకు వచ్చిన నాని లెక్క ఇప్పుడు ఇంకాస్త పెరిగినట్లు అర్ధమవుతుంది. నాని ఎలాంటి సినిమా చేసిన నాన్ థియేట్రికల్ గానే మంచి రేట్లు వస్తుంటాయి. అక్కడే నిర్మాత సగం సేఫ్ అవుతారు. ఇక నాని డిమాండ్ కు తగ్గట్టుగానే దానయ్య అతనికి 50 కోట్ల చెక్ ఇచ్చినట్లు టాక్. ఇటీవల నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్‌ ఎల్వీ సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుండగా.. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నాని బలగం వేణుతో కూడా సినిమా చేయనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి నాని ఈ సంవత్సరం అంత సినిమాల బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే సినిమాలు నానికి ఎలాంటి హిట్ తెచ్చిపెడతాయో చూడాలి .






Untitled Document
Advertisements