షుగర్ పేషెంట్స్ కి బ్రౌన్ రైస్ మంచిదేనా

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 09:57 AM

షుగర్ పేషెంట్స్ కి బ్రౌన్ రైస్ మంచిదేనా

మన పూర్వికులు ఎక్కువగా పొట్టు ఉన్న బియ్యాన్ని తినేవారు. ఆ టైములో వారికీ అవి దొరకడమే చాల కష్టంగా ఉండేది. అంతేకాకుండా రాగులు, జోన్నలు, సజ్జలు, కొర్రలు మొదలైన మిల్లెట్స్ ఫుడ్ మాత్రమే తీసుకునే వారు అందువలన వారికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉన్నాయి . కానీ ప్రస్తుత కాలంలో ఎక్కువగా వైట్ రైస్ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంత మంది బ్రౌన్ రైస్ ను తినడానికి మక్కువ చూపుతున్నారు ఎందుకంటే . ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్‌రైస్ చూడ్డానికి కాస్తా లేత గోధుమ రంగులో ఉంటాయి. బ్రౌన్‌రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వైట్ రైస్ బదులు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.
మీ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్ తీసుకుంటే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం మనకి అందుతాయి.ఇందులో ఫైబర్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నింటి కంటే తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతేకాకుండా పీచుతో కూడిన బ్రౌన్‌రౌస్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఈ బ్రౌన్‌రైస్‌ని వరిపై పొట్టుని మాత్రమే తీసి ఉంచుతారు. పాలిష్ ఉండదు. దీని వల్ల పేగు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

షుగర్ కంట్రోల్:
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య షుగర్ . దీనికి ముఖ్య కారణం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది. తెల్ల బియ్యంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ ఉన్నవారు బ్రౌన్‌రైస్ తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు.

బరువు తగ్గేందుకు:
ఇతర సీజన్స్ కంటే సమ్మర్‌ని భరించడం కాస్తా కష్టమైనది. ఈ టైమ్‌లో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం కాస్త కష్టమైన పనే. దీనికోసం బ్రౌన్‌రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్‌ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీని వల్ల చాలా కాలం పాటు ఆకలి కంట్రోల్ అవుతుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దీంతో కేలరీను కూడా తగ్గించుకోవచ్చు. దీంతో బరువు తగ్గుతారు.వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. కొంతమందికి కొన్ని ధాన్యాల్లో ఆర్సెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులని పెంచుతాయి. బ్రౌన్‌రైస్‌లో ఆ ఆర్సెననిక్ గుణం కూడా ఉంటుంది. రోజుకి అరకప్పు బ్రౌన్‌రైస్ తినండి. ఇందులో దాదాపు 110 కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గేవారు రోజూ తీసుకోవచ్చు.ఈ విధంగా బ్రౌన్ రైస్ ను మన ఆహారం లో భాగంగా చేసుకొని తినడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును . దీనిని చిన్న పిల్లలకు అలవాటు చేస్తే వారికీ ఈజీ గ తినడానికి అలవాటు పడిపోతారు అప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.






Untitled Document
Advertisements