వేసవిలో తినాల్సిన ఆహారాల్లో ఆ పప్పు ముఖ్యమట

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 10:57 AM

వేసవిలో  తినాల్సిన ఆహారాల్లో ఆ పప్పు ముఖ్యమట

మన నిత్య జీవితంలో ఏదో ఒకరకమైన పప్పు ను తింటూఉంటాము కానీ ఇందులో ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా తినవలసినది పెసరపప్పు . ఎందుకంటే ఇది చాల చలువ చేస్తుంది . అంతేకాకుండా పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి.
వేసవిలో బరువు త్వరగా తగ్గుతారు. తేలికపాటి ఆహారం తినడం వల్ల బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవచ్చు. రెండు రకాల పెసరపప్పు అందుబాటులో ఉంది. ఒకటి పొట్టు తీసిన పెసరపప్పు, పొట్టు తీయని పెసరపప్పు. ఈ పప్పులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పెసరపప్పు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కావున జీర్ణక్రియలో పెసరపప్పు త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి పొట్ట తేలికగా ఉంటుంది.గుండెకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పెసరపప్పు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వేసవిలో చలువ చేసే ఆహారాలను తినడం చాలా ముఖ్యం. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెసరపప్పు తగ్గిస్తుంది.పెసర పప్పు తో చాల రకాలైన వంటకాలను చేసుకోవచ్చును ఏ ఆకుకూర అయినా పెసరపప్పుతో కలిపి చేసుకోవచ్చును ఎలా చేసుకోవడం వలన వాటికీ మంచి రుచి వస్తుంది . అంతేకాకుండా ఈ పప్పు తో చాల రకాలైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది .





Untitled Document
Advertisements