ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆహారంలో ఈ రెండు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలట..

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 11:42 AM

ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆహారంలో ఈ రెండు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలట..

కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి కరోనా అనే మహమ్మారి మన జీవితాలను మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ టైములో తెలియని వారికీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వేటికి దూరంగా ఉండాలి అనే విషయాలు అందరికి తెలిసి వచ్చాయి . అయితే కొంత మంది కాయగూరలు, ధాన్యాలు, పప్పు వంటి మొక్కల నుంచి వచ్చే ఆహారాలే తింటారు. ఈ డైట్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్, కేలరీలు, సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఇతర పోషకాలు లభిస్తాయి. మొక్కల ఆధారిత ఆహారం ఆరోగ్యానికి మంచిదే, కానీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించేలా చూసుకోవాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తింటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ లభిస్తాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి
క్వినోవా, గోధుమలు, ఓట్స్ వంటి ధాన్యాలు ఆహారంగా తింటే ఫైబర్, B విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఈ హోల్ గ్రెయిన్స్‌ ఆరోగ్యం, శక్తి స్థాయిలను పెంచుతాయి.బాదం, జీడిపప్పు, చియా గింజలు, గుమ్మడికాయ గింజలు, హెంప్ గింజలు, ఇతర నట్స్, సీడ్స్ నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పొందవచ్చు. వీటి ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. సాధారణంగా ఈ కొవ్వు ఆమ్లాలు చేపలలో మాత్రమే లభిస్తాయి.
బీన్స్, కాయధాన్యాలు (Lentils), శనగలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఇతర ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన వనరులు. అనేక రకాల వంటలలో వీటిని ఉపయోగించవచ్చు. ఇవి మంచి పోషక విలువను అందిస్తాయి.అంతేకాకుండా ఆవు లేదా గేదె పాలకు బదులు బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ తాగవచ్చు. ఇవి కాల్షియం, విటమిన్ D లాంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. సాధారణంగా ఈ పోషకాలు పాల ఉత్పత్తులలో మాత్రమే లభిస్తాయి.అవోకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల వనరులు మెదడు పనితీరు, హార్మోన్ ఉత్పత్తి, మొత్తం కణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఈ కొవ్వులు విటమిన్లు A, D, E, K లాంటి కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడానికి అవసరం. మాంసం, పాలు, గుడ్లు వంటి జంతు ఉత్పత్తులను తినకుండా మొక్కల ఆధారిత ఆహారం మాత్రమే తినేవారికి విటమిన్ B12 లోపం రావచ్చు. దీంతో వీరు విటమిన్ సప్లిమెంట్లు (Nutrient supplements) తీసుకోవడం మంచిది. అలాగే, చేపలు తిననివారు ఆల్గే పోషకాల మాత్రలు ద్వారా ఒమేగా-3 కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. అలాగే ఈ డైట్ ఫాలో అయ్యేవారు వివిధ రకాల ప్లాంట్-బేస్డ్ ఫుడ్స్ తినేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలైన ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి అప్పుడే మనకు కావలసిన పోషకాలు లభిస్తాయి ఎలాంటి రోగాలు వచ్చిన తట్టుకునే శక్తి మన శరీరానికి లభిస్తుంది .






Untitled Document
Advertisements