బరువు తగ్గాలి అనుకునే వారు ఈ టీని అలవాటు చేసుకోవడం బెస్ట్

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 11:54 AM

బరువు  తగ్గాలి అనుకునే వారు ఈ టీని అలవాటు చేసుకోవడం బెస్ట్

కొంత మంది బరువు తగ్గించుకోవాడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు అలాగే ఫుడ్స్, డ్రింక్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాల మంది టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు ఏవి చాల టేస్టీగా ఉంటాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటి బదులుగా కొన్ని హెర్బల్ డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ తాగొచ్చు. అలాంటి కాఫీలలో బ్రకోలీ కాఫీ కూడా ఒకటి. దీనిని ఎలా తయారు చేయాలి. తాగితే ఎలాంటి లాభాలో తెలుసుకోండి.

బ్రకోలి టీ తయారు విధానం :
బ్రకోలి టీ తయారు చేయడం చాలా ఈజీ. బ్రకోలీని క్లీన్ చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. దీనిని పొడి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ బ్రకోలీ పౌడర్‌ని మీ రెగ్యులర్ కాఫీ పౌడర్‌లో మిక్స్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల బ్రకోలీ పౌడర్ ఓ కప్పు బ్రకోలీని తీసుకుంటే అదే మొత్తంలో పోషకాలను అందిస్తుంది. బ్రకోలీలో ప్రోటీన్స్, పీచు పదార్థాలు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.
బ్రకోలీ తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర కణాల్లో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించగలవు. దీనిలోని ప్రోటీన్, ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. శరీర జీవక్రియని పెంచి బరువు తగ్గడంలో సాయపడుతుంది. అందులో కాఫీ కలిపితే జీవక్రియ పెరుగుతుంది.కేలరీలు కూడా చాలా తక్కువ కాబట్టి, బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఈ బ్రకోలీ పౌడర్‌ని సూప్స్, స్మూతీస్, సలాడ్స్‌లో ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా, బ్రకోలీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కొవ్వుని తగ్గించడానికి అవసరమైన పోషకాలు.
ఇన్ని పోషకాలు ఉన్న బ్రకోలి తో చేసే టీ ని తాగడానికి అలవాటు చేసుకోవడం మంచిది . అంతేకాకుండా బ్రకోలి తో వంటకాలు కూడా చేసుకోవచ్చును .





Untitled Document
Advertisements