పద్మవిభూషణ్ తీసుకోవడానికి ముందు మావయ్య చిరంజీవికి కోడలు ఆసక్తికర ప్రశ్న..

     Written by : smtv Desk | Fri, May 10, 2024, 12:05 PM

 పద్మవిభూషణ్ తీసుకోవడానికి ముందు మావయ్య చిరంజీవికి కోడలు ఆసక్తికర ప్రశ్న..

అభిమానులంతా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తీసుకున్నారు. అవార్డు తీసుకోవడానికి ముందు చిరంజీవి.. ఆయన కోడలు ఉపాసన మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియో ప్రకారం.. చిరంజీవి అవార్డును తీసుకోవడానికి ముందు డ్రెస్సింగ్ రూంలో ఉన్న సమయంలో ఉపాసన అక్కడకు వెళ్లారు. 'మామయ్యా.. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నాలో.. క్లీంకారలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి?' అని ఉపాసన అడిగారు. దానికి చిరంజీవి స్పందిస్తూ.. నీకు ప్రతిరూపమంటూ సమాధానం ఇచ్చారు.

'కాదు, మామయ్యా.. కామన్ పాయింట్ ఏమంటే మా ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ వచ్చింది' అని ఉపాసన సమాధానం చెబుతారు. దానికి చిరంజీవి స్పందిస్తూ.. అవును.. వీసీ రెడ్డి గారు, నేను.. అవును అని నవ్వేశారు. ఈ వీడియోలో చిరంజీవి, ఉపాసనతో పాటు రామ్ చరణ్ తేజ కూడా ఉన్నారు.
https://twitter.com/SAIKRIS40918887/status/1788792646720225599?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1788792646720225599%7Ctwgr%5Ed18572edbe1e608ebad27e1bf184460519d56d4b%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F801204%2Fupasana-interesting-question-to-chiranjeevi





Untitled Document
Advertisements