ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

     Written by : smtv Desk | Fri, May 10, 2024, 12:55 PM

ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం పాలసీ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ కవిత మొదట రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అయితే విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. గడువు లోగా ఈడీ తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆదేశించారు.





Untitled Document
Advertisements