అధికబరువుని తగ్గించే యోగాసనాలు ఇవే..

     Written by : smtv Desk | Fri, May 10, 2024, 01:01 PM

అధికబరువుని తగ్గించే యోగాసనాలు ఇవే..

యోగాసనాలు శారీరక సమస్యల నుంచి మానసిక సమస్యల్ని తగ్గిస్తాయి. వీటిని చేయడం వల్ల మనసు రిలాక్స్‌గా మారుతుంది. వీటి వల్ల బరువు తగ్గడమే కాకుండా కండరాలు, అంతర్గత అవయవాల పనితీరుని మెరుగ్గా చేసే శక్తి యోగాకి ఉంది. అలాంటి ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
వజ్రాసనం.. నేలపై కూర్చుని భోజనం చేసేటప్పుడు కాళ్ళు మడుచుకుని కూర్చొంటారు. కొందరైతే మోకాళ్ళపై కూర్చున్నట్లుగా ఉంటారు. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, నేటి కాలంలో ఎవరు నేలపై కూర్చోవడంలేదు. ఈ వజ్రాసనం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వజ్రాసనం వేర్వేరు ఆసనాలకి మూల భంగిమ అని చెప్పొచ్చు. కూర్చొన్న భంగిమలో కాళ్ళు ముడుచుకుని తుంటిపై వాటిపై ఉంచుతారు. ఈ ఆసనంతో తొడలు, పొట్ట భాగంలో కొవ్వు కరికి బరువు తగ్గుతారు.

చతురంగాసనం.. ఈ ఆసనం చేయడం కూడా ఈజీనే. అయితే ప్రయోజనాలు మాత్రం ఎక్కడ ఉంటాయి. ఇది చూడ్డానికి పుష్‌అప్ చేసినట్లుగా ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల శరీరం మొత్తం కదలిక, ఒత్తిడి కలుగుతుంది. ముఖ్యంగా చేతులు, ఛాతీ ప్రాంతం, భుజం, పొత్తికడుపు ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగి కండరాలు బిగుసుకుపోతాయి. దీని కారణంగా ఆ ప్రాంతాల్లో కొవ్వు నిల్వలు బర్న్ అవుతాయి. కండరాల బలం పెరుగుతుంది.

ధనురాసనం.. ఈ ఆసనం విల్లులా ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల పొత్తికడుపు బిగుతుగా మారి పొట్ట, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇప్పటికే కొవ్వు ఉన్న కొవ్వుని కూడా బర్న్ చేస్తుంది. పెల్విస్, వీపు వంగడం వల్ల

వీరభద్రాసనం.. ఈ ఆసనం యోధుని రూపంలో ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా మారుతుంది. చేసేటప్పుడు తొడ, తుంటిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కాబట్టి, తొడలు, తుంటి పొత్తికడుపులో వదులుగా ఉన్న కండరాలు బిగుతుగా మారడమే కాకుండా ఆ ప్రాంతాల్లో కొవ్వు కూడా తగ్గుతుంది.

యోగా చేసే ముందు.. ఏదైనా ఆసనాలు చేసే ముందు తేలికైన వార్మప్ వర్కౌట్స్ చేయడం మంచిది. అందరూ అన్ని ఆసనాలు వేయలేరు. మీకు ఏవైనా సమస్యలుంటే ముందుగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. యోగా ఉదయం, సాయంత్రం రెండు పూటలా చేయొచ్చు. అయితే, ఉదయం పరగడపున చేస్తేనే మంచి బెనిఫిట్స్ ఉంటాయి.





Untitled Document
Advertisements