బరువు తగ్గాలి అనుకునే వారికి అన్నం బదులుగా ఇవి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్

     Written by : smtv Desk | Thu, May 16, 2024, 12:34 PM

బరువు తగ్గాలి అనుకునే వారికి అన్నం బదులుగా ఇవి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అధికబరువుతో బాధపడుతున్న వారి సంఖ్యా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే ఈ అధికబరువు అనేది మధుమేహం, హైబీపి, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, వంటి మరెన్నో ఇతర సమస్యలకి కారణమవుతుంది. ఈ సమస్య నుండి బయటపడేందుకు మీరు డాక్టర్ సలహా తీసుకోవచ్చు. అయితే, వీటన్నింటిని దూరం చేసుకోవడంలో బరువు తగ్గించుకోవడం. ఇందుకోసం సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం. అదే విధంగా బియ్యం బదులు ఏమేం తీసుకోవచ్చో తెలుసుకోండి.

క్వినోవా.. క్వినోవాని సూపర్‌ఫుడ్ అంటారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. క్వినోవాని బియ్యం బదులు తీసుకోవచ్చు. దీని వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలిగా అనిపించదు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు.

గోధుమ రవ్వ.. గోధుమ రవ్వ కూడా బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వీటిని తీసుకోవడం శరీరంలో కొవ్వు తగ్గుతుంది. వీటిని హాయిగా బ్రేక్‌ఫాస్‌లో కూడా తీసుకోవచ్చు.

రాగులు.. రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కూడా బియ్యం బదులు తీసుకోవచ్చు. ఇందులో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్ కూడా ఎక్కువగానే ఉంది. ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. పీచు పదార్థం వల్ల జీర్ణక్రియకి చాలా మంచిది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో రాగులని తీసుకోవచ్చు. అధిక కేలరీలు తీసుకోవడం తగ్గించాలి. ఇందుకోసం రాగుల్ని దోశ, జావలా తీసుకోవచ్చు.





Untitled Document
Advertisements