మహిళలు హ్యాండ్ బ్యాగ్ లో తప్పక ఉండాల్సిన వస్తువులు ఇవే

     Written by : smtv Desk | Thu, May 16, 2024, 01:46 PM

మహిళలు హ్యాండ్ బ్యాగ్ లో తప్పక ఉండాల్సిన వస్తువులు ఇవే

ఈ మధ్యకాలంలో మహిళలకు హ్యాండ్ బ్యాగ్ వాడకం అనేది తప్పనిసరిగా మారింది. మహిళలకు తమకు అవసరం వున్న ప్రతి ఒక్క వస్తువుని హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయడం అలవాటు. అయితే తమ అవసరానికి తగ్గట్టుగా బ్యాగ్ సైజ్ ఎంచుకుంటారు. ముఖ్యంగా మహిళలు వారి బ్యాగ్‌లో ఏమేం తీసుకెళ్ళాలో ఓ లుక్కేసేద్దామా..

* పర్స్.. మీరు ఇంటినుంచి బయటికి వెళ్ళినప్పుడు పర్స్‌ని అస్సలు మరిచిపోవద్దు. మీ ఐడెంటిటీ కార్డు, ఏటీఎమ్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి.
* ఇంటి తాళం.. అదే విధంగా, ఇంటి తాళాలు కూడా తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. రోజువారీ హడావిడిలో తాళాలను మర్చిపోకుండా ఓ స్పేర్ కీ ఎప్పుడు మీ బ్యాగ్‌లో ఉంచడం మంచిది.
* స్నాక్స్.. ఇంట్లో తిని వెళ్తే మళ్ళీ బయట ఎప్పుడు తింటామో.. ఎక్కడ తింటామో తెలియదు. కాబట్టి, స్నాక్స్ తీసుకెళ్లండి. హెల్దీ నట్స్, కుకీస్ క్యారీ చేయడం ఈజీ. హ్యాపీగా కూడా తినవచ్చు.
* మాస్క్.. ఇది కూడా హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకోవాలి. ఇది మిమ్మల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. డస్ట్ అలర్జీల వంటి సమస్యల్ని కూడా మిమ్మల్ని కాపాడుతుంది.
* మొబైల్ ఫోన్స్.. మొబైల్ ఫోన్ మన జీవితంలో ఓ ముఖ్య భాగమైపోయింది. మీరు బయటికి వెళ్ళినప్పుడు కచ్చితంగా మొబైల్ తీసుకెళ్లండి. అదే విధంగా, చార్జింగ్ ఫుల్‌గా ఉండేలా చూసుకోండి. చార్జర్ కూడా మరిచిపోవద్దు. ఎందుకంటే లేట్ అయినా సరే.. బయట ఎక్కడైనా చార్జ్ చేసుకోవచ్చు.
* బుక్స్.. బుక్స్ చదవడం అనేది మంచి అలవాటు. దీని వల్ల మీరు ఒత్తిడి, విసుగు వంటి ఆలోచనల్ని దూరం చేసుకుంటారు. కాబట్టి, బుక్స్, నవలలు తీసుకెళ్ళడం అలవాటుగా మార్చుకోండి.
* వాటర్ బాటిల్..,వాటర్ బాటిల్‌ని ఎప్పుడు కూడా మన వెంట ఉంచుకోవాలి. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు తాగుతాం. అలాంటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకోవాలి.
* ఫస్ట్ ఎయిడ్ కిట్.. ఇది వినగానే భయపడొద్దు. కొన్ని ఐటెమ్స్ ఉంచుకోవడం మంచిది. అన్నీ సందర్భాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి, దీనిని కచ్చితంగా క్యారీ చేయడం మంచిది.





Untitled Document
Advertisements