5 గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు

     Written by : smtv Desk | Thu, May 16, 2024, 04:05 PM

5 గంటలు ఆలస్యంగా  సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు

ఈరోజు సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఏకంగా ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు రీషెడ్యూల్ అయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖలో ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరాల్సిన ఈ రైలు దాదాపు 5 గంటలు ఆలస్యమైంది. ఇదే రైలు సికింద్రాబాద్ వచ్చి తిరిగి విశాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు రాత్రి ఎనిమిది గంటలకు రీషెడ్యూల్ చేశారు. వందేభారత్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.





Untitled Document
Advertisements